రేసు కేసులో ఈడి పిలుపు
ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో ఈడి కూడా దూకుడు పెంచింది.ఈ మేరకు కేటిఆర్‌కు నోటీసులు జారీ చేసింది. కొత్త సంవత్సరంలో జనవరి 7న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా కేసులో ఏ2గా భావిస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్‌కి ఈడీ నోటీసులు పంపింది.హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.అయితే అరవింద్, బీఎల్ఎన్ రెడ్డి మాత్రం జనవరి 2,3 తేదీల్లోనే హాజరు కావాలని చెప్పింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద విచారణ ఈడి ఈ విచారణ చేపట్టినట్లు నోటీసుల్లో స్పష్టంగా తెలిపింది.