Home Page SliderNational

ఆప్ నేతకు క్షమాపణలు చెప్పిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు ప్రముఖులను ఈడీ విచారిస్తుంది. కాగా ఈడీ లిక్కర్ స్కామ్‌లో ఆప్ నేత సంజయ్ సింగ్‌ పేరును కూడా చేర్చింది. దీంతో ఆయన స్కామ్‌లో తన పేరును చేర్చి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఈడీకి సంజయ్ లీగల్ నోటీసులు పంపిచారు. దీనిపై స్పందించిన ఈడీ లిక్కర్ స్కామ్‌లో పొరపాటున  సంజయ్ సింగ్ పేరును చేర్చామని తెలిపింది.  ఈ మేరకు సంజయ్ సింగ్‌కు క్షమాపణలు చెబుతూ ఈడీ ఆయనకు అధికారిక లేఖ పంపింది. క్లరికల్ తప్పిదం కారణంగా రాహుల్ సింగ్ పేరుకు బదులు సంజయ్ సింగ్ పేరు ప్రింట్ అయ్యిందని ఈడీ స్పష్టం చేసింది. మొత్తానికి ఈ  విషయంలో తప్పు మాదే అని ఈడీ అంగీకరించింది.