రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే ఈసీ
రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్‌రాజ్ పని చేస్తున్నారని బీజేపీ ఎం కె.లక్ష్మణ్ ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచే ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. బీజేపీకి ఆధిక్యం వచ్చే ప్రాంతాల్లో ఫలితాలను ఆలస్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి స్పందిస్తే తప్ప ఈసీ పని చేయదా..? అని నిలదీశారు. మునుగోడులో అంతిమ విజయం బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు.

