ఏపీలో సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఈసీ నిరాకరణ
ఏపీ సర్కారుకు ఈసీ షాకిచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్, ఇన్ పుట్ సబ్సిడీకి ఈసీ నో చెప్పింది. పంట నష్టం పరిహారం ఇచ్చేందుకు ఈసీ అనుమతివ్వలేదు. ఏపీలో అమల్లో ఉన్న పథకాలకు అనుమతివ్వాలని ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తికి ఎన్నికల సంఘం అనుమతివ్వలేదు.

