తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ సన్నాహాక సమావేశం
తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కాగా రాష్ట్రంలో మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో తెలంగాణాలోని అధికార ,ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలలో ఎలా విజయం సాధించాలో అని వ్యూహలు రచిస్తున్నారు. మరోవైపు తెలంగాణా ఈసీ కూడా ఎన్నికలపై దృష్టి సారించింది. కాగా తెలంగాణా ఎన్నికల కమీషన్ ఎన్నికల ఏర్పాట్లపై ఇప్పటికే పలు సమీక్షలు నిర్వహించింది. దీనిలో భాగంగా త్వరలోనే తెలంగాణా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో ఎన్నికల సీఈఓ వికాస్ రాజ్ పార్టీ నేతలతో ఎన్నికల అంశాలపై చర్చించనున్నారు. వీటిలో ముఖ్యంగా ఓటరు లిస్ట్ ,ఎన్నికల నిర్వహణ,శాంతిభద్రతల అంశాలతోపాటు ఆయా పార్టీలకు ఉన్న అభ్యంతరాలపై చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.