Home Page SliderNational

కేజ్రీవాల్ ప్లాన్‌కు ఈసీ బ్రేక్..

ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు పెట్టాలంటూ కేజ్రీవాల్ చేసే డిమాండ్‌కు ఈసీ బ్రేక్ వేసింది. ఆప్ కోరుకున్నట్లు మహారాష్ట్రతో కలిపి ఢిల్లీకి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనితో కేజ్రీవాల్ ప్లాన్‌కు బ్రేక్ పడినట్లయ్యింది. అయితే కేజ్రీవాల్ సీఎంగా రాజీనామా చేస్తానని ప్రకటించడంతో ఢిల్లీకి తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయించవలసిన అవసరం వచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తామని తెలిపారు. కేజ్రీవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే ముందస్తు ఎన్నికలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సవాల్ విసిరారు. కేజ్రీవాల్‌పై ఢిల్లీ ప్రజలకు నమ్మకం ఉందని, మరోసారి ఆప్‌నే ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ పరువు తీసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నేడు మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, సీఎం కేజ్రీవాల్‌తో తాత్కాలిక సీఎం ఎవరనే అంశంపై భేటీ కానున్నారు.