ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌పై ఈసీ నిషేధం
కేంద్రం ఎన్నికల సంఘం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. హిమచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో నవంబర్ 12 నుంచి ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌ను నిషేదిస్తున్నట్లు ప్రకటించింది. ఎగ్జిట్ పోల్స్‌ను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచురణ, ప్రసారం చేయకూడదని నోటిఫికేషన్ జారీ చేసింది. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తమ ఆదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రధానాధికారులకు సూచించింది. అలాగే మీడియా రంగాలకు సైతం తెలియజేయాలని స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్ శనివారం భారీ భద్రత నడుమ పోలింగ్ మొదలైంది. మరోవైపు.. గుజరాత్ డిసెంబర్ 1,5 తేదీల్లో ఓటింగ్ జరగనుంది.

