ఉదయం 8 గంటలకు టిఫిన్ తినడం కంపల్సరీ
ఉదయం 8 గంటలకు అల్పాహారం, రాత్రి 8 గంటలకు చివరి భోజనం తినడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని ఫ్రాన్స్‌కు చెందిన వైద్య పరిశోధకులు చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు తినేవారి కంటే 9 గంటలకు తినే వారిలో హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం 6 శాతం ఎక్కువగా ఉంటాయన్నారు. రాత్రి 8 కి బదులు 9 గంటలకు తినడం వల్ల స్ట్రోక్స్ వచ్చే చాన్స్ పెరుగుతుందని తెలిపారు.

