మెంతి మొలకలు రోజూ తీసుకోవడం హెల్త్‌కి మంచిది..
మెంతి మొలకల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలున్నాయి. ప్రతిరోజూ ఆహారంలో మెంతులు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాలు అధికంగా ఉండే మెంతి మొలకలను రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల ఇవి శరీరానికి సూపర్ ఫుడ్‌గా పనిచేస్తాయి. ఇంకా వీటితో.. మెంతులు మన భోజనంలో అధిక ప్రాధాన్యత కలిగిన దినుసుగా వాడుతూ ఉంటాం. మెంతుల్లో అనేక పోషకాలున్నాయి. ఆహారంలో మెంతులు కలపడం వల్ల వాటికి ఉన్న ప్రత్యేకమైన సువాసన, రుచి పదార్థాలకు కొత్త రుచిని తీసుకువస్తాయి. మెంతులే కాకుండా మెంతి ఆకులు కూడా పప్పు, పులుసు వంటి పదార్థాలకు వాడుతూ ఉంటాం. ఊరగాయలలో కూడా మెంతులు ప్రధానంగా వాడతాం. మెంతులను మొలకెత్తిన వాటిని తీసుకుంటే ఇంకా అనేక పోషకాలు శరీరానికి అందుతాయి.
మెరుగైన జీర్ణక్రియ.. మెంతి మొలకల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలకు, మలబద్దకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు.. మొలకలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే సామర్థ్యానికి, ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. మెరుగైన జీవక్రియ.. మెంతి మొలకలు విటమిన్లు, ఖనిజాలు అధిక కంటెంట్ కారణంగా జీవక్రియను పెంచుతాయి. ఇవి బరువును నియంత్రించడంలో సహకరిస్తాయి.