Home Page SliderNational

చపాతీలను అలా తింటే ఆరోగ్యానికి హానికరం!

చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునేవారు అన్నానికి బదులుగా చపాతీలు ఎక్కువగా తింటుంటారు. అయితే చపాతీలను కొందరు గ్యాస్ పొయ్యి మీద స్టవ్లోంచి వచ్చే మంటపై నేరుగా కాల్చుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఆ మంటలో కార్బన్ మోనాక్సెడ్, నైట్రోజెన్ డైయాక్సైడ్, సూక్ష్మమైన దుమ్ము కణాలు బోలెడన్ని ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళితే అనారోగ్యానికి దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ గ్యాస్ స్టవ్ మీద కాల్చినా నేరుగా ఆ మంటపై చపాతీలు పెట్టొద్దని.. మూకుడు లేదా పెనంపై పెట్టి చేసుకోవాలని సూచిస్తున్నారు. దీని కంటే కట్టెల పొయ్యి మీద కాల్చడం బెటర్ అంటున్నారు.