Home Page SliderTelangana

అక్టోబర్ 10న ఎన్నికల నోటిఫికేషన్-ఈటల రాజేందర్

తెలంగాణ ప్రాంత ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నారని… సందర్భం రాబోతుంది.. అప్పుడు దమ్మేంటో చూపిస్తారన్నారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. వచ్చే నెల 10న ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందన్నారు. ఆరిపోయే ముందు దీపం వెలిగినట్లుగా కేటీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని… డబుల్ బెడ్ రూమ్ రాదేమో.. సంక్షేమ పథకాలు రావేమో.. అని భయానికి ప్రజలు మీ పాట పాడుతున్నారు తప్ప ప్రజల గుండెల్లో, ప్రజల అంతరంగాల్లో కేసీఆర్‌ లేరన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు బొంద పెడతామా అని ప్రజలు ఆరాటపడుతున్న విషయం మీకు తెలియదన్నారు ఈటల. గురివింద నలుపు దానికి తెలియనట్లుగా..నీ కింద ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదన్నారు. తెలంగాణ ప్రజలు గొప్పవారని… మంచేదో, చెడేదో తర్కించుకునే…. మంచికి, ఆత్మగౌరవానికే జైకొడతారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ జెండా ఎగరవేయబోతున్నామన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మోడీ మహబూబ్ నగర్ రాబోతున్నారని.. సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని.. ఏ ఇంటికి ఆ ఇల్లు తరలిరావాలని ప్రజలకు ఈటల విజ్ఞప్తి చేశారు.