Home Page SliderTelangana

కేసీఆర్ బాధితుల సంఘం అధ్యక్షుడిగా ఈటల రాజేందర్

నేను వస్తున్న అని తెలవగానే కేసీఆర్ కామారెడ్డి పోయిండు. నాభార్య ఒక్కటే మాట చెప్పింది అన్నీ అమ్ముకుందాం, అవసరం అయితే మళ్ళీ కొంగు నడుంకి కట్టి పనిచేస్తా.. నువ్వు మాత్రం కేసీఆర్ మీద కొట్లాట ఆపవద్దు అని చెప్పింది. నాకు దిక్కులేక గజ్వేల్ రాలేదు. బాధతో వచ్చిన. కేసీఆర్ బాధితులకు నేను అధ్యక్షున్ని. నాకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసిన దుద్దెడ ప్రజలకు శిరస్సువంచి నమస్కారం. దుద్దెడ పక్కనే కలెక్టర్ కార్యాలయం ఉంది. 20 ఎకరాలు అవసరం ఉంటే 356 ఎకరాలు తీసుకున్నారు. భూమి తీసుకొని 250 గజాల ఇంటి స్థలం ఇస్తారట. పైగా 1.75 లక్షలు సుడాకి కట్టమని నోటిసులు ఇచ్చారట. మన భూమికి మనమే డబ్బులు కట్టే దుస్థుతికి కారకుడు కేసీఆర్. ఏ గ్రామానికి పోయినా ఇదే పరిస్థితి. మనోహరాబాద్ మండలంలో మూడు కోట్లు ఎకరం ఉన్న భూమి తీసుకున్నారు. అది తీసుకున్నది ప్రాజెక్ట్ కోసమో, ఇళ్ళ జాగాల కోసమో, స్కూల్, హాస్పిటల్ కోసమో తీసుకోలేదు. తీసుకుంది వ్యాపారులకు అమ్ముకోవడానికి. భూమి ఇచ్చినవారికి 8 లక్షలు ఇచ్చి.. వ్యాపారులకు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి 2 కోట్లకు అమ్ముకున్నారు. కేసీఆర్ బ్రోకర్గిరి చేస్తున్నారు. పేదల కళ్లల్లో మట్టికొట్టిన సీఎం, కేసీఆర్ అంటూ దుయ్యబట్టారు ఈటల రాజేందర్.

వర్గల్ పక్కన అవుసలోళ్లపల్లె, తునికి బొల్లారం ప్రాంతాల్లో వేల ఎకరాలు గుంజుకున్నారు. వారంతా ఒకటే అంటున్నారు. ఈయనకు ఓట్లు వేసిన పాపానికి మా బ్రతుకుల్లో మట్టికొట్టారని. తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటో, అప్పటి ముఖ్యమంత్రుల మీద ఎలా నిప్పులు చెరిగానో మీ అందరికీ తెలుసు. ప్రధానిని కలిసినప్పుడు మా ప్రజలకు ఏం చెప్పాలి అని అడిగా.. డబుల్ బెడ్ రూమ్ కట్టే జిమ్మేదార్ తీసుకోమని చెప్పారు. కేసీఆర్ ఉంటే ఫాంహౌసులో లేదంటే ప్రగతి భవన్‌లో ఉంటాడు తప్ప ప్రజలను కలవడు. ఫాం హౌస్ కి వస్తుండు అంటే ఆరు గంటల పాటు రోడ్లన్నీ బంద్ పెట్టి నరకం చూపిస్తున్నారు. జామకాయలు, కంకులు అమ్ముకొనే వారిని లేకుండా చేస్తారు. తెలంగాణ వచ్చిన నాడు మద్యం ఆదాయం 10,700 కోట్లు అయితే ఇప్పుడు 45 వేల కోట్లు దీనిమీద అసెంబ్లీలోనే కాదు అబిడ్స్ చౌరస్తాలో మాట్లాడడానికి సిద్ధం.

ఒక్క ఓటు వేయండి ముసలివాళ్ళు ఇద్దరికీ పెన్షన్ ఇస్తాం. 57 ఏళ్ళు నిండిన వారికి పెన్షన్ ఇస్తాం. తెలంగాణలో ప్రతి పేద కుటుంబం పెద్ద చనిపోతే 5 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తాం. మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ అందిస్తాం, ఇన్సూరెన్స్ డబ్బులు మేమే కడతాం. ఒక్క కిలో అందనంగా తరుగులేకుండా ధాన్యం కొనుగోలు చేసే జిమ్మేదార్ మాది. మాకు ఓటు వేయమనేది పదవి కోసం కాదు. ఉచితంగా వైద్యం, విద్య అందించడానికి అడుగుతున్నాం. తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డ లక్ష రూపాయల అప్పుతో పుడుతున్నారు. కరెంటు బిల్లు ఇంతకు ముందు రెండు నెలలకు వచ్చేది. ఇప్పుడు నెలకో వస్తోంది. నేను వస్తున్న అని తెలవగానే కేసీఆర్ కామారెడ్డి పోయిండు. నాభార్య ఒక్కటే మాట చెప్పింది అన్నీ అమ్ముకుందాం, అవసరం అయితే మళ్ళీ కొంగు నడుంకి కట్టి పనిచేస్తా.. నువ్వు మాత్రం కేసీఆర్ మీద కొట్లాట ఆపవద్దు అని చెప్పింది. ఆమె హుజూరాబాద్ లో ప్రచారం చేస్తుంది. నేను మీదగ్గరుకి వచ్చిన. కేసీఆర్ మీ ఓటు హక్కును కొనే ప్రయత్నం చేస్తారు. 170 మంది మఫ్టీ పోలీసులు ఊళ్లలో తిరుగుతున్నారట ఎవరు కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నారో చూసి కౌన్సిలింగ్ చేస్తున్నారట. మీరేమన్నా అమాయుకులా వారిమాటలు వినడానికి అని అన్నారు ఈటల.