Home Page SliderTelangana

ఈటల నామినేషన్.. గజ్వేల్ జన ప్రవాహం


గజ్వేల్ నామినేషన్ ఘట్టంలో బీజేపీ విజయం స్పష్టమైపోయింది. 40 వేల మంది ఈటల నామినేషన్ ర్యాలీలో పాల్గొనడం ఆషామాషీ కాదు. ఓవైపు ప్రభుత్వం నుంచి ప్రతిఘటన మరోవైపు నిర్బంధాన్ని దాటుకొని.. ఈటలకు మద్దతు పలకారు. ఈటల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఇవాళ సిచ్యువేషన్‌లో ఫుల్ క్లారిటీ వచ్చింది. పింఛన్ రావాలన్నా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రావాలన్నా కేసీఆర్ దిగిపోవాలి. కేసీఆర్ ప్రజలను నట్టేట ముంచుతున్నాడన్న ఈటల రాజేందర్… తడిగుడ్డతో గొంతు కోసే నైజం కేసీఆర్‌ది అంటూ ఈటల మండిపడుతున్నారు. గజ్వేల్ గడ్డను బాగు చేసుకునేందుకు కేసీఆర్‌ను ఓడించాలన్న ఈటల పిలుపునిచ్చారు.

గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన తరువాత కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారితో కలిసి మీడియాతో మాట్లాడారు ఈటల రాజేందర్. బీజేపీ నేషనల్ ఎక్జిక్యూటివ్ సమావేశాల్లోనే తెలంగాణల్లో కమలం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారని, ఆ సంకల్పంలో భాగంగానే తామందరం పని చేస్తున్నామన్నారు ఈటల. ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని… కేసీఆర్‌ను ఓడించే సత్తా బీజేపీకే ఉందన్నారు. అవినీతి రహిత, దేశ ఔన్నత్యాన్ని ప్రపంచపటం మీద ఎగురవేసేలా పాలన మోదీ అందిస్తున్నారన్నారు. నాయకులు మారుతుండొచ్చు.. వారికి వేరే ఆలోచనలు ఉండొచ్చు కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి ఆలోచన ఉండవన్నారు. నామినేషన్ ర్యాలీలో 40 వేల మంది పాల్గొన్నారంటే ఆషామాషీ కాదన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను గెలిపించుకున్న పాపానికి 30 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.