Andhra PradeshHome Page Slider

ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు

ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈ రోజు ఉదయం రెండు సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో గంగవరం, రామభద్రపురం, శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడులో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భయాందోళనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.