Home Page SliderNational

మణిపూర్ లో భూకంపం..

మణిపూర్ రాష్ట్రంలో ఇవాళ రెండు సార్లు భూకంపం సంభవించింది. ఉదయం 11.06గంటలకు మొదటి భూకంపం సంభవించగా, రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.7గా నమోదయింది. ఆ తర్వాత మధ్యాహ్నం 12.20 గంటలకు 4.1 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. భూకంపం ప్రభావానికి తౌబల్ జిల్లాలోని ఓ స్కూల్ సహా కొన్ని భవనాలు దెబ్బతిన్నా యి. భూకంప నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.