భూకంప బీభత్సం..ఎంతమంది మృతి చెందారంటే..
మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలలో భూకంపం బీభత్సం సృష్టించింది. 12 నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు భారీ భూకంపాలు సంభవించడంతో అక్కడి ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనం కుప్పకూలిపోవడంతో 90 మంది గల్లంతయ్యారని థాయ్‌లాండ్ మంత్రి ప్రకటించారు. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రధాని మెట్రో, రైలు సేవలను నిలిపివేశారు. మయన్మార్‌లో కూడా ఈ భూకంపం విలయం సృష్టించింది. అక్కడ 1000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది. ఇక్కడ మృతులు అత్యధికంగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇంకా అనేక చోట్ల భవనాలు, పాత వంతెనలు కుప్పకూలినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.