నడిస్తే చాలు.. రోజుకు రూ.28 వేల సంపాదన
ప్రతిరోజు 7 గంటల పాటు నడిస్తే రోజుకు రూ.28 వేల రూపాయలు ఇస్తామని వాకింగ్ ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఒక ప్రముఖ కంపెనీ. గంటల తరబడి నడవాలనుకునేవారికి గంటకు రూ.4 వేల చొప్పున ఇస్తామని, దీనితో రోజుకు రూ.28 వేలు సంపాదించుకోవచ్చంటూ ప్రముఖ వాహన తయారీ సంస్థ టెస్లా ఆఫర్ ఇచ్చింది. విషయం ఏమిటంటే ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ వాహనాలతో పాటు అచ్చం మనిషిలా ఉండే ఒక హ్యుమనాయిడ్ రోబోట్‌ను అభివృద్ధి చేస్తోంది. దీనికోసం ‘మోషన్ క్యాప్చా’ పద్దతిలో సాంకేతికల సహాయంతో రోబోట్‌కు నడకలో శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. ఇలా నడిచే వారిని ఈ పని కోసం వినియోగించుకోవాలనే ఆలోచనతో టెస్లా ఇలాంటి ఆఫర్లు పెట్టిందని భావిస్తున్నారు.