డిప్యూటీ సీఎం ఏరికోరుకున్న డైనమిక్ ఆఫీసర్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కేరళలోని త్రిసూర్ కలెక్టర్ కృష్ణతేజను నియమించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ పరిపాలనలో తనదైన మార్క్ చూపించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన పేషీలో పనిచేయబోయే ఐఏఎస్ ఆఫీసర్లను వారి సర్వీస్ ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఎంపిక చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటివరకు తన సర్వీస్‌లో మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్న కృష్ణతేజను ఏరి కోరి మరి ఎంచుకున్నారు. దీంతో కలెక్టర్ కృష్ణతేజను డిప్యూటేషన్‌పై ఏపీకి పంపించాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.అయితే 2015 బ్యాచ్‌కి చెందిన కృష్ణతేజది పల్నాడు జిల్లా చిలకలూరిపేట అని సమాచారం.కాగా ఈయన కేరళలో పర్యాటకవృద్ధి,అలప్పుజ కలెక్టర్‌గా అద్భుత పనితీరు కనబరిచి కేంద్ర నుంచి ఎన్నో అవార్డులను అందుకున్నారు.