దువ్వాడ శ్రీనివాస్ నోటి దురుసు..కేసు నమోదు
ఏపీలో ఇటీవల వరుసగా వైసీపీ నేతలపై, మద్దతు దారులపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ నోటి దురుసు కారణంగా ఇరకాటంలో పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ పనులను ప్రశ్నించకుండా ఉండేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు నెలకు రూ.50 కోట్ల లంచం ఇస్తున్నారని, ఆ లంచం సొమ్ము తిని పవన్ గొంతు మూగబోయిందని విమర్శించారు. దీనితో ఇవి అనుచిత వ్యాఖ్యలంటూ జనసేన నేత అడపా మాణిక్యాలరావు గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మరి కొన్ని చోట్ల కూడా జనసేన కార్యకర్తలు దువ్వాడపై ఫిర్యాదులు చేస్తున్నారు.

