సింగరేణి కార్మికులకు దసరా బోనస్
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ఇచ్చారు. సింగరేణి సంస్థ లాభాల్లో 30 శాతం కార్మికులకు పంచాలంటూ సీఎంవో బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లాభాల వాటాను బోనస్‌గా కార్మికులకు దసరా పండుగలోపే అందజేయాలని పేర్కొన్నది. 30 శాతం వాటా అంటే కార్మికులకు రూ.368 కోట్లు అందుతాయి. సింగరేణి లాభాల్లో కార్మికులకు దసరా కానుకగా 2020లో 28 శాతం వాటాను, 2021లో 29 శాతం వాటాను ఇచ్చారు. ఈసారి మరో శాతం పెంచి.. 30 శాతం వాటాను కార్మికులకు పంచడం విశేషం. బోనస్ ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు సింగరేణి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, టీజీబీకేఎస్ నేతలు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.