కేటీఆర్ పాదయాత్ర ఎవరి కోసం?
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు చేశామని ప్రజలకు తెలుపడానికి కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నారా? అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదవులు కోల్పోయాం అన్న అక్కసుతో కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వీరు పదవులు లేకపోతేనే ప్రజాక్షేత్రంలోకి వెళ్తారా? అని నిలదీశారు.

