NationalTrending Today

మోదీ ఎన్నికల ప్రచారవేళ, జమ్ము,కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లే ఎన్‌కౌంటర్లు

జమ్మూ, కాశ్మీర్‌లో రక్తం ఏరులై పారుతోంది. ఆర్టికల్ 356 రద్దు తర్వాత జమ్ము, కశ్మీర్ లో పదేళ్ల తర్వాత జరగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. అయితే ఇదే అదనుగా తీసుకొని ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ హింసాత్మక ఘటనలు ఎక్కువవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3 ఎన్‌కౌంటర్లలో 5 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఈ చర్యలలో ఇద్దరు సైనికులు ప్రాణార్పణ చేశారు. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్, శుక్రవారం అర్థరాత్రి ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని పట్టన్ ప్రాంతంలో కాల్పులు ప్రారంభమయ్యాయి. బారాముల్లా జిల్లాలో ఈ ఉదయం భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఉగ్రవాదులు నక్కిఉన్నారని తెలుసుకొని భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. శుక్రవారం అర్థరాత్రి ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని పట్టాన్ ప్రాంతంలోని చక్ తాపర్ క్రీరీలో కాల్పులు జరిగాయి.

వేర్వేరు ఎన్‌కౌంటర్‌లో, ఆర్మీకి చెందిన రైజింగ్ స్టార్ కార్ప్స్ యూనిట్ శుక్రవారం కథువాలో ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపింది. సెప్టెంబర్ 11న ప్రారంభించిన జాయింట్ ఆపరేషన్‌లో ఉగ్రవాదులను హతమార్చడంతోపాటు, భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

అంతకుముందు శుక్రవారం, జమ్మూ మరియు కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) సహా ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించారు. పలువురు అధికారులు గాయపడ్డారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాతో కిష్త్‌వార్‌ను కలిపే ఛత్రూ బెల్ట్‌లోని నైద్‌గామ్ ప్రాంతంలో ఆర్మీ, పోలీసుల సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. కాల్పుల్లో నలుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు — నాయబ్ సుబేదార్ విపన్ కుమార్, JCO, జవాన్ అరవింద్ సింగ్ మరణించారు.

ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటన
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ మెగా ఎన్నికల ర్యాలీకి ముందు ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఎన్నికల ర్యాలీని శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు దోడా, కిష్త్వార్ జంట జిల్లాల అంతటా, భద్రతను కట్టుదిట్టం చేశారు. గత 42 ఏళ్లలో దోడాలో ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న మూడు దశల్లో జరగనుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న జరుగుతుంది. పదేళ్లలో ఇవే మొదటి అసెంబ్లీ ఎన్నికలు. జమ్మూ, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దు, ఆర్టికల్ 35A రద్దు తర్వాత, జమ్మూ, కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి.