మహిషాసురమర్దనిగా దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. బెజవాడ దుర్గమ్మ శవన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిషాసుర మర్దని అలంకారంలో కనువిందు చేస్తున్నారు. మహిషాసుర మర్దని అలంకారంలో అమ్మవారిని చూడడానికి భక్తులు పోటెత్తారు. మహిషాసురుడనే లోకకంటకుడైన రాక్షసుని సంహరించి అమ్మవారు మహిషాసుర మర్దనిగా అవతరించింది. సింహవాహనంతో, చేతిలో శూలంతో దివ్యతేజస్సుతో అమ్మవారు విరాజిల్లుతారు. ఈ రోజుతో నవరాత్రులు ముగుస్తాయి. పదవరోజు దుర్గమ్మ రాజరాజేశ్వరిగా, లోకాన్నంతా పాలించే చల్లని తల్లిగా దర్శనమిస్తారు. సకల శుభాలను కలిగించే విజయదశమి రోజున ఏ పనిని మొదలుపెట్టినా దిగ్విజయంగా జరుగుతుందని పెద్దలమాట.

