Andhra PradeshHome Page Slider

సిరులనొసగే మహాలక్ష్మిగా దుర్గమ్మ

విజయవాడలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఆరవరోజు దుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో కుంకుమ పూజలు చేసుకుంటున్నారు. ఈ నవరాత్రులలో నవరూపాలతో అమ్మ భక్తులను అనుగ్రహిస్తున్నారు.