“డూప్లిసెస్ ఓ యోధుడు”
ఈ IPL సీజన్ ప్రారంభం నుంచి ఎంతో రసవత్తరంగా సాగుతోంది. కాగా ఈ సీజన్‌లో జట్టులన్ని ఎంతో పోటాపోటిగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న బెంగుళూరులో జరిగిన CSK Vs RCB మ్యాచ్‌లో RCB చివరి వరకు పోరాడి ఓడింది. దీంతో RCB ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే నిన్న జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. కాగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్టుల ఆటగాళ్లు ఫోర్లు,సిక్స్‌లతో అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా RCB కెప్టెన్ డూప్లిసెస్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఓ పక్క నడుముకు గాయమైన పట్టించుకోకుండా కట్లు కట్టుకొని మరి ఫోర్లు,సిక్సులతో చెలరేగి 62 పరుగులు చేశాడు. దీంతో అతని ఫ్యాన్స్ అందరూ “డూప్లెసిస్ నువ్వో యోధుడివి” అని ట్వీట్స్ చేస్తున్నారు.

