Home Page SliderTelangana

డీఎస్సీ అభ్యర్థుల ధర్నా

తమకు ఉద్యోగ పోస్టింగ్ లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2008 డీఎస్సీ అభ్యర్థులు ప్రజాభవన్ ఎదుట ధర్నాకు దిగారు. జీవో నెంబర్ 9 తెచ్చి కేబినెట్ అప్రూవల్ చేసి కూడా సంవత్సరం గడిచిందని.. అయినా తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రలో లేని రీతిలో రెండోసారి కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ తీసుకోని 4 నెలలు అవుతుందని.. ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ లేనందున బయట ఉద్యోగాలు కూడా చేసుకోలేకపోతున్నామని వాపోయారు. ఇంట్లో వాళ్లపై ఆధారపడలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని తమకు వెంటనే ఎస్జీటీ ఉపాధ్యాయ ఉద్యోగానికి పోస్టింగులు ఇవ్వాలని వేడుకున్నారు.