DSC అభ్యర్థులకు అలెర్ట్.. నేడే చివరి తేదీ
తెలంగాణ: టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తు గడువు తేదీ నేడు (గురువారం)తో ముగియనుంది. ఏప్రిల్ 3 నాటికే గడువు ముగియాల్సి ఉండగా మార్చిలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో అప్లికేషన్ల గడువును నేటి వరకు పొడిగించారు. కాగా, బుధవారం సాయంత్రం వరకు 2,64,804 మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 17 నుండి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి.