home page sliderHome Page SliderTelangana

టోలీచౌకీలో డ్రంక్ అండ్ డ్రైవ్

హైదరాబాద్ లోని టోలీచౌకీలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటన చోటు చేసుకుంది. టోలీచౌకీలోని ఫ్లైఓవర్ బ్డిడ్జి వద్ద మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తిని మరో వ్యక్తి వీడియో తీసి కారు ఆపమని కోరాడు. అయినా కారును ఆపకుండా దూసుకెళ్లాడు సదరు వ్యక్తి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.