Home Page SliderNational

ముంబై ఎయిర్‌పోర్ట్ లో కోట్లు విలువ చేసే డ్రగ్స్ లభ్యం

ముంబై విమానాశ్రయంలో భారీ ఎత్తున డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఇద్దరు ప్రయాణీకుల వద్ద దాదాపు 47 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్, కొకైన్ దొరికాయి. కస్టమ్స్ జోనల్ అధికారులు నిన్న(శుక్రవారం) బాగా లోతుగా తనిఖీలు నిర్వహించారు. 31కోట్ల విలువగల 4.5 కిలోల హెరాయిన్, 15 కోట్ల విలువగల కొకైన్ లభ్యమయ్యాయి. ఇద్దరు ప్రయాణీకుల నుండి వాటిని స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాఫ్రికానుండి వచ్చిన వ్యక్తి వద్ద హెరాయిన్ దొరికింది. దానిని డాక్యుమెంట్ ఫోల్డర్ల కవర్లలో దాచి, తీసుకొచ్చినట్లు గుర్తించారు.

కొకైన్‌ ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన వ్యక్తి వద్ద లభ్యమయ్యింది. అతని లగేజ్‌లో కుర్తా బటన్లు అధిక సంఖ్యలో అనుమానాస్ఫదంగా కనిపించాయి. దీనితో బటన్లను విడదీసి, పరిశీలించగా దాదాపు ఒకటిన్నర కిలోల కొకైన్ లభించింది. దీనితో వారిద్దరినీ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్ స్టెన్స్(NDPS) చట్టప్రకారం అరెస్టు చేసి 14 రోజుల కస్టడీకి తరలించారు.