Home Page SliderTelangana

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

తెలంగాణా రాజధాని హైదరాబాద్‌లో నిత్యం డ్రగ్స్ కేసులు వెలుగు చూడటం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు కూడా రేవ్ పార్టీలల్లో డ్రగ్స్‌ తీసుకొని పట్టుబడటం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రోజు మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. కాగా నిందితుల నుంచి రూ.24లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే వీరు బెంగుళూరు,విశాఖ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.అయితే వీరిలో 6గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.