Home Page Sliderhome page slider

నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. షాకిచ్చిన ఆర్టీసీ..

నమాజ్ చేయడానికి బస్సును మార్గమధ్యలో ఆపిన డ్రైవర్ కమ్-కండక్టర్ ను ఆర్టీసీ సస్పెండ్ చేసింది. ఈ ఘటన కర్ణాటకలో ఏప్రిల్ 29న హుబ్బళ్లిలో జరిగింది. హుబ్లీ నుంచి హవేరికి వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. రహదారి పక్కన బస్సును నిలిపివేసిన ఆర్టీసీ డ్రైవర్, బస్సులోని ఓ సీటుపై కూర్చుని నమాజ్ చేశారు. ఆ సమయంలో కొంత మంది ప్రయాణికులు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ప్రయాణికుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు సదరు డ్రైవర్ పై విచారణకు ఆదేశించారు.