Home Page SliderNational

షూటింగ్ పూర్తి చేసుకున్న డబుల్ ఇస్మార్ట్

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “డబుల్ ఇస్మార్ట్”.ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ తాజాగా పూర్తైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని మూవీ యూనిట్ వెల్లడించింది. కాగా ఈ సినిమాలో కావ్యా థాపర్,సంజయ్ దత్,అలీ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కాగా 2019లో పూరీ-రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో ఆ సినిమాకు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్‌ను రూపొందించారు.