Home Page SliderTelangana

11 వేలమంది బాధితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు..సీఎం

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మూసీ వద్ద ఉన్న పేద ఆక్రమణ దారులకు 11 వేల మందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చారు. చెరువుల ఆక్రమణలను తప్పించడానికే హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు పెద్దలు ప్రాజెక్టుల వద్ద ఫాంహౌసులు కట్టుకున్నారని అన్నారు. వాటి నుండి వచ్చే డ్రైనేజ్‌ని గండిపేట చెరువులో కలుపుతున్నారని మండిపడ్డారు. నాలాల ఆక్రమణల వల్ల ఉప్పెనలా వరదలు వచ్చి, పేదల ఇళ్లు మునుగుతున్నాయన్నారు. ఈ పరేడ్‌లో పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. సబ్ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. 145 మంది మహిళా ఎస్సైలు సహా మొత్తం 547 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక రోజు వేతనాన్ని వరద బాధితుల సహాయానికై పోలీసులు ఇచ్చారు. ఈ మొత్తం రూ.11.06 కోట్లు చెక్కును రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్ అందజేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని సీఎం సూచించారు. నేరస్తులను ఉపేక్షించేది లేదన్నారు.