Home Page SliderTelangana

18 వరకు దోస్త్ రిపోర్టింగ్ గడువు పెంపు

హైదరాబాద్: దోస్త్ ద్వారా మూడు విడతల్లో సీట్లు పొంది ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారు.. ఆయా కళాశాలల్లో స్వయంగా రిపోర్టింగ్ చేసే గడువు శుక్రవారంతో ముగిసింది. కాగా, గడువు పెంచాలని విద్యార్థులు విన్నవించగా ఈ నెల 18 వరకు పొడిగించినట్లు కన్వీనర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఇప్పటివరకు 1,17,057 మంది మాత్రమే కళాశాలల్లో రిపోర్ట్ చేశారని పేర్కొన్నారు.