నీకు సొంత ఆలోచనలు లేవా మండిపడ్డ సీఎం
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఈవో శ్యామలరావుపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. తొక్కిసలాట కారణాలపై ఆరా తీసిన ముఖ్యమంత్రికి గతంలో ఏర్పాట్లు చేసినట్లే ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేశామని ఈవో వెల్లడించారు. వైకుంఠ ఏకాదశికి తగిన పూర్తి ఏర్పాట్లు చేయలేకపోయినట్లు గుర్తించిన చంద్రబాబు గతంలో చేసిన ఏర్పాట్లే ఎలా చేస్తారని, మీకు సొంత ఆలోచనలు లేవా ఎవరో చేసినట్లే ఎలా చేస్తావు అంటూ మండిపడ్డారు. కొత్త టెక్నాలజీని, డ్రోన్స్ ఉపయోగించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయొచ్చు కదా అంటూ ప్రశ్నించారు.

