‘ఈ సర్వేపై రాద్దాంతం చేయొద్దు’..పొన్నం
రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై రాద్దాంతం చెయ్యొద్దంటూ ప్రతిపక్షాలను హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సర్వేపై దుద్దేడ గ్రామంలో కుటుంబ సర్వేలో పాల్గొన్నారు మంత్రి. ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం ఇస్తున్నారన్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 35 శాతం కుటుంబ సర్వే పూర్తయ్యిందన్నారు. ఎవరికైనా కులం చెప్పడం ఇష్టం లేకపోతే 999 అనే ఆప్షన్ ఉందని పొన్నం పేర్కొన్నారు.

