వక్ఫ్ బోర్డ్ అంటే ఏమిటో తెలుసుకోవాలని లేదా?
ఇస్లాం మతాచారాలు పాటించే ముస్లింలు తమకున్న స్థిర, చరాస్తులను దానం చేస్తే, ఆ ఆస్తులను వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుని వాళ్ల అండర్‌లో ఉంచుకుంటుంది. ఈ ఆస్తులన్నింటినీ నిర్వహించేదే వక్ఫ్ బోర్డు. దేశ విభజన సమయంలో ఇండియా నుండి పాక్ వెళ్లిపోయిన ముస్లింల ఆస్తులను వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంది. దేశంలోని 30 వక్ఫ్ బోర్డుల పరిధిలో 9.4 లక్షల ఎకరాలు ఉన్నాయి. వీటి విలువ రూ.1.2 లక్షల కోట్లు. మిలిటరీ స్థలాలు, రైల్వే స్థలాలు, ఆస్తుల తర్వాత అత్యధికంగా భూములు కలిగి ఉన్నది వక్ఫ్ బోర్డులే కలిగి ఉన్నాయి.