Andhra PradeshNews

డోంట్ టచ్ మీ

డోంట్ టచ్ మీ.. అని పోలీసులకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. పలాస వెళ్తుండగా ఆయనను శ్రీకాకుళం నగర సమీపంలో హైవేపై పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేష్ మేం టెర్రరిస్టులమా.. నక్సలైట్లమా.. ఎమ్మెల్సీగా నాకు ఎక్కడైనా పర్యటించే హక్కు ఉంది. గౌరవం ఇచ్చి పుచ్చుకోండి.. అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పోలీసులు ఆయనను ముందుకు కదల నీయకపోవడంతో మాజీ మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్ప, పలువురు టిడిపి నాయకులతో సహా లోకేష్ రోడ్డుపైనే నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు, టిడిపి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో లోకేష్ తో పాటు చినరాజప్ప, కళా వెంకట్రావు తదితరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎచ్చెర్ల సమీపంలోని జేఆర్ పురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Read more: తప్పు చేశాడు కాబట్టే… కేసీఆర్‌ ఈడీకి భయపడుతున్నాడు