మీడియాతో మాట్లాడొద్దు..
భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రిటైర్డ్ అధికారులకు ఆర్మీ కీలక సూచన చేసింది. భారత్ బలాబలాలపై టీవీ చానళ్ల కు ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని పేర్కొంది. ఆర్ముడ్ ఫోర్సెస్ లో వివిధ హోదాలో పని చేసిన రిటైర్డ్ స్టాఫ్ కు ప్రత్యేకంగా సమాచారం అందించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సూచనలు అంతా తప్పక పాటించాలని పేర్కొంది.