Home Page SliderTelangana

‘సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్ చేయకండి’..మహేశ్ బాబు

‘హీరోయిన్ సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణం’ అంటూ తెలంగాణ మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా స్టార్ హీరో మహేశ్ బాబు ఈ విషయంపై స్పందించారు.  రాజకీయాల కోసం సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకుంటున్నారని ఆరోపించారు.  ఒక మహిళా మంత్రి అయ్యిండి, మరో మహళా సెలబ్రెటీపై ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేయడం, అలాంటి భాష వాడడంపై తాను తీవ్ర వేదనకు గురయ్యానని పేర్కొన్నారు. ఒక కూతురికి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా ఒక మహిళకు జరిగిన అన్యాయానికి తాను ఎంతో బాధపడ్డానన్నారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతిననంత వరకే మన వాక్ స్వాతంత్య్రం ఉపయోగించుకోవచ్చని, ఇది మీరితే అది నేరం అవుతుందని స్పష్టం చేశారు. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకోవద్దని అభ్యర్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.