గంభీర్‌కి నాకు గొడవల్లేవ్
డ్రెస్సింగ్ రూంలో తనకు కోచ్ గౌతం గంభీర్‌కి మధ్య ఓపెన్ వార్ జరిగినట్లు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రమూ నిజం లేదని టీం ఇండియా వన్ ఆఫ్ ది స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ వెల్లడించారు.ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరిని (గౌతం గంభీర్) ని విమర్శించకూడదని ఫ్యాన్స్‌కి సూచించారు.తాను టెస్ట్ క్రికెట్ కి రిటైర్ మెంట్ ప్రకటించబోతున్నట్లు వార్తల్లో కూడా నిజం లేదన్నారు.తాను అన్ ఫిట్ గా ఉన్నానని,ఇదే విషయాన్ని కోచ్ కి చెప్తే సరే అన్నారని, జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్ట్ కి దూరంగా ఉంటానని గౌతంతో చెప్పానన్నారు. తాను ఎంత కష్టపడుతున్నా ఫాం లోకి రాలేకపోతున్నానని ఇవన్నీ ఆలోచించే సిడ్నీఐదో టెస్ట్ కి దూరంగా ఉన్నానని రోహిత్ శర్మ వెల్లడించారు. పర్యటన ఆసాంతం బూమ్రా కెప్టెన్సీ ఎంతో బాగుందని , మనకి ( టీం ఇండియా) కి ఈ పర్యటనలో మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు.
BREAKING NEWS: ఢిల్లీకి వెళ్లొద్దు బాబోయ్


 
							 
							