‘ఇష్టమొచ్చినట్లు హామీలివ్వొద్దు’…ఖర్గే
రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులకు అధిష్టానం హామీల విషయంలో చురకలు వేస్తోంది. ఇష్టప్రకారం ఎన్నికల సమయంలో హామీలు కురిపించొద్దని సూచనలు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ విషయంలో రాష్ట్రాలను హెచ్చరించారు. తమ రాష్ట్రాల బడ్జెట్‌ను పరిగణించకుండా హామీలు ప్రకటించవద్దని కీలక వ్యాఖ్యాలు చేశారు. త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలు జరగనుండడంతో బడ్జెట్ ఆధారంగా గ్యారెంటీలు ప్రకటించాలని పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణలలో పథకాలను అమలు చేయడానికి అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. హామీలు అమలు చేయలేక ప్రజలలో నమ్మకం కోల్పోవద్దని హెచ్చరించారు.

