InternationalNationalNews

భారత్‌ సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దు, అమెరికాకు చైనా వార్నింగ్

భారత్‌తో సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధికారులను చైనా హెచ్చరించిందని అమెరికా కాంగ్రెస్‌కు ఇచ్చిన నివేదికలో పెంటగాన్ పేర్కొంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి భారతదేశంతో ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా అధికారులు సంక్షోభ తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నించారని తెలిపింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సరిహద్దు ఉద్రిక్తతలను నిరోధించేందుకు భారత్ అమెరికాతో మరింత సన్నిహిత భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోందని గుర్తించిందని వివరించింది. భారత్‌ సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని పీఆర్‌సీ అధికారులు అమెరికా అధికారులను హెచ్చరించినట్లు పెంటగాన్ తన తాజా నివేదికలో పేర్కొంది. సరిహద్దు స్థిరత్వాన్ని కాపాడటానికి భారతదేశం, పెంటగాన్‌తో దాని ద్వైపాక్షిక సంబంధాలు కోరుకుంటుందని చైనా భావిస్తోంది.

చైనా-భారత్ సరిహద్దులోని 2021 అంతటా, PLA బలగాల మోహరింపును కొనసాగించిందని, LAC వెంట మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని కొనసాగించిందని అమెరికా రిపోర్ట్‌లో పేర్కొంది. సరిహద్దులో ప్రయోజనాలు దెబ్బతినకుండా… ఇరుపక్షాలు ప్రతిఘటించడంతో చర్చలు సఫలమయ్యాయంది. మే 2020 నుండి, చైనా, భారతీయ దళాలు LAC వెంబడి అనేక ప్రదేశాలలో ముళ్ల తీగతో చుట్టబడిన రాళ్ళు, లాఠీలతో ఘర్షణపడ్డాయి. ఫలితంగా ప్రతిష్టంభన సరిహద్దుకు ఇరువైపులా బలగాల ఏర్పాటును ప్రేరేపించింది. రెండు దేశాలు బలగాలను ఉపసంహరించుకోవాలని, ప్రతిష్టంభనకు ముందు పరిస్థితులకు తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశాయి. అయితే చైనా, భారతదేశం ఆ షరతులపై అంగీకరించలేదని అమెరికా రిపోర్టులో తెలిపింది. భారతీయ మౌలిక సదుపాయాల నిర్మాణాలపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేయగా… చైనా తమ భూభూగంలోకి ఇండియా వస్తోందని విమర్శించింది. అయితే భారతదేశం భూభాగంలోకే చైనా చొరబాట్లను ప్రారంభించిందని ఆరోపించిందని నివేదకలో అభిప్రాయపడింది.

2020 ఘర్షణ నుండి, PLA నిరంతరం సరిహద్దుల వద్ద బలగాల మోహరింపుతోపాటు, మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని కొనసాగించింది. 2020 గాల్వాన్ వ్యాలీ ఘటన గత 46 ఏళ్లలో ఇరు దేశాల మధ్య జరిగిన అత్యంత ఘోరమైన ఘర్షణ అని నివేదిక పేర్కొంది. జూన్ 15, 2020న, గాల్వాన్ వ్యాలీలో పెట్రోలింగ్‌ సమయంలో హింసాత్మకంగా ఘర్షణ జరిగిందిత. ఈ ఘటనలో సుమారు 20 మంది భారతీయ సైనికులు, నలుగురు PLA సైనికులు మరణించారని PRC అధికారులు తెలిపారు. కానీ వస్తవానికి చైనా నుంచి పెద్ద ఎత్తున సైనికులు ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయారని పలు విదేశీ నివేదికలు స్పష్టం చేశాయి.