Home Page SliderTelangana

మజ్లిస్ దరిదాపుల్లోకి వెళ్లేందుకు ధైర్యం లేదా..?

ప్రజలకు హైడ్రా మీద అనుమానం కలుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేద, మధ్య తరగతి కుటుంబాలపైనే హైడ్రా ప్రతాపం చూపిస్తోందన్నారు. వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న బడా కంపెనీల దరిదాపుల్లోకి ఎందుకు హైడ్రా వెళ్లడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని 25 చెరువులను బడా కంపెనీలకు అభివృద్ధి పేరుతో అప్పజెప్పారన్నారు. మజ్లిస్ దరిదాపుల్లోకి వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం లేదా? అని పాయల్ శంకర్ ప్రశ్నించారు. చెరువు కడుపులో మట్టిని పోసి ఫాతిమా కాలేజీని కట్టారు.. ఆ కాలేజీ నిర్మాణం హైడ్రాకు కనిపించటం లేదా? అని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.