Home Page SliderInternational

‘ట్రంప్‌తో మాకీ తలనొప్పి వద్దు’..బోడిగుండుతో మహిళల నిరసన

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నకైనందుకు కొందరు సంతోషంగానే ఉన్నా, ఒకవర్గం మహిళలకు ఇష్టం లేనట్లు తెలుస్తోంది. వారు ట్రంప్ ఏలుబడిలో తమ హక్కులకు భంగం కలుగుతాయని భావిస్తున్నారు. బోడిగుండులు చేయించుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలుగేళ్లూ ఎలాంటి సంతోషాలు లేకుండా సన్యాసినిలా గడిపేస్తామంటున్నారు. సౌత్ కొరియాలో 2010లో మొదలైన ‘4బి’ మూమెంట్‌ను అమెరికాలో కూడా పాటిస్తామంటూ ‘క్యూ’లు కడుతున్నారు వందల కొద్దీ అమ్మాయిలు. వీరందరూ ‘ఓక్’ భావజాలం ఉన్న లేడీస్. అంటే వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చే అమెరికా వంటి దేశాలలో కాస్త విశృంఖలమైన ఆడా,మగా సంబంధం లేకుండా కలిసి జీవించే సంస్కృతికి చెందినవారని చెప్పవచ్చు. ఇలాంటి వారు గుండు కొట్టించుకుని ట్రంప్ పదవిలో ఉన్న నాలుగేళ్లూ ‘4బి మూమెంట్‌’కు కట్టుబడి ఉంటామంటున్నారు. ‘బి’ అంటే కొరియాలో ‘వద్దని’ అర్థం. అంటే 4 పనులకు వీరు ‘నో’ చెప్తున్నారన్నమాట. ‘నో డేటింగ్’, ‘నో మ్యారేజ్’, ‘నో చైల్డ్’, ‘నో రిలేషన్‌షిప్ విత్ మెన్’ అన్నమాట. ఎందుకంటే ట్రంప్ మహిళా గర్భస్రావాలను సంబంధించిన చట్టాలను కఠినతరం చేస్తానని ఎన్నికల హామీలో ప్రకటించారు. ఈ పద్దతి మహిళా స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రష్యా, చైనా వంటి దేశాలు జననాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నాయి. అలాగే ట్రంప్ మీద కోపంతో మహిళలు సంసారానికి దూరమైతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు.