‘అక్కడికి వెళ్లొద్దు’..కేంద్రం హెచ్చరికలు
ఇరాన్ దేశానికి ప్రయాణాలు మానుకోవాలని భారత ప్రభుత్వం పౌరులను హెచ్చరించింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వల్ల పశ్చిమాసియాలో ఆందోళకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. తాము యుద్ధప్రాంతాలలోని పరిస్థితులు నిశితంగా పరిశీలిస్తున్నామని, భారత పౌరులు ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గత మూడు రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడడం తెలిసిందే. మంగళవారం భీకర క్షిపణి దాడులు చేసింది.