ఇసుక, లిక్కర్ జోలికి పోవద్దు..చంద్రబాబు హెచ్చరిక
ఏపీలో ఇసుక, లిక్కర్ జోలికి పోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రజా ప్రతినిధులను హెచ్చరించారు. ఈ వ్యాపారాల విషయంలో టీడీపీ పార్టీ జోక్యం ఉండకూడదని స్పష్టం చేశారు. కొత్తగా లిక్కర్ వ్యాపారంలోకి వెళ్లి సంపాదించుకోవాలని ఎవరూ ఆశ పడవద్దన్నారు. మన కార్యకర్తలను గత వైసీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టి, అరెస్టులు చేసి వేధించారని గుర్తు చేశారు. మనం కూడా అలాగే చేస్తే రాష్ట్రం రావణకాష్టం అవుతుందన్నారు. మనం తప్పులు చేయవద్దు. వాటిని ఎత్తిచూపే అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వొద్దని హెచ్చరించారు. రాబోయే ఎన్నికలలో మన ప్రవర్తన, మాటతీరు పైనే విజయం, మెజారిటీ ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు.