Home Page SliderTelangana

ఫేక్ గ్యారంటీలు ఇస్తున్న కాంగ్రెస్‌ను చూసి మోసపోవద్దు-కిషన్‌రెడ్డి

హైదరాబాద్: అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అష్టకష్టాలు పడి ఆచరణకు సాధ్యం కాని హామీలను గుప్పిస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీకి అన్నివర్గాల నుండి ఆదరణ లభిస్తోందని, ఇది మిగతా పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. బడుగు బలహీనవర్గాలు, షెడ్యూల్ తెగల ప్రజలు బీజేపీని విశేషంగా ఆదరిస్తున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కొన్ని సర్వేలు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నా బీజేపీ అభ్యర్థులకు ఆదరణ తగ్గడం లేదన్న కిషన్‌రెడ్డి.