home page sliderNationalSportsTrending Today

దేశంపై నా చిత్తశుద్ధిని అనుమానించొద్దు..నీరజ్ చోప్రా

జావెలిన్ త్రోలో భారత్‌కు ఒలింపిక్స్ మెడల్స్ అందించిన అథ్లెట్ నీరజ్ చోప్రా ఇప్పుడు ఉగ్రదాడి నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం పాకిస్థాన్ జావెలిన్ త్రో స్టార్ అర్షద్ నదీమ్‌ను భారత్‌కు ఆహ్వానించడమే. అయితే ఈ ఆహ్వానం గతేడాది జరిగిందని దానికోసం ఇప్పుడు విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. తనపై, తన కుటుంబంపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది తనను చాలా బాధించిందని పేర్కొన్నారు. తాను ఇండియన్ ఆర్మీకి సంబంధించినవాడినేనని, తన దేశభక్తి విషయంలో తన చిత్తశుద్ధిని అనుమానించవద్దని విజ్ఞప్తి చేశారు. తాను కేవలం అథ్లెట్‌గానే అర్షద్‌ను ఆహ్వానించానని, అప్పుడే అతడు మరో కార్యక్రమం వల్ల తన ఆహ్వానాన్ని తిరస్కరించారని గుర్తు చేశారు. గతేడాది మే నెలలో బెంగళూరు వేదికగా జరిగిన ఎన్‌సీ క్లాసిక్ జావెలిన్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కోసం పారిస్ ఒలింపిక్స్‌ సమయంలోనే ఆహ్వానించానని పేర్కొన్నారు. ఆ పోటీలో పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌కు బంగారు పతకం లభించగా, నీరజ్ చోప్రాకు రజత పతకం లభించింది.