‘నన్ను అభినందించవద్దు..మాదృష్టిలో సీఎం ఆయనే’..ఆతిశీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ సీఎంగా ఎన్నికైన అనంతరం ఆతిశీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడం తనకెంతో బాధ కలిగిందన్నారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టానని “నన్ను అభినందించవద్దు. పూలమాలలు వేయకండి. మా దృష్టిలో కేజ్రీవాలే సీఎం. రాబోయే ఎన్నికలలో తిరిగి ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నాను. కేజ్రీవాల్ ఎంతో నిజాయితీపరుడు”. అంటూ పేర్కొన్నారు. ఆయనను అన్యాయంగా ఆరునెలల పాటు జైలులో పెట్టారని, ఇది కుట్ర, తప్పుడు ఆరోపణలు మాత్రమే అన్నారు. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడం సుప్రీంకోర్టు బీజేపీ, దర్యాప్తు సంస్థలకు చెంపపెట్టు కొట్టినట్లే అన్నారు. ఆయన అరెస్టు ఖచ్చితంగా అక్రమమే అన్నారు. ఆయన స్థానంలో మరెవరైనా ఉంటే రాజీనామా చేసి ఉండేవారు కాదన్నారు.